Tuesday, July 9, 2013

గంగ గరుడాలెత్తుకెళ్ళేరా..ఇంక ఆంబోతులాట సాగేరా

అద్భుతమైన ఒక పాట.ఈ పాట ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభాను వ్రాశి పాడారు. ఇక్కడ చూడండి:

గంగ గరుడాలెత్తుకెళ్ళేరా..ఇంక ఆంబోతులాట సాగేరా..

ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కండ్లు సూడు

భూమి బుగ్గై పోయె.. సూడు బొంద గడ్డల జోరు సూడు..


ఎవ్వారొ...

ఎవ్వారొ ముద్దు బిడ్డలు రా... ఎందుకనొ పరుగెట్టినారు రా..

ఎవ్వారొ ముద్దు బిడ్డాలెందుకనొ పరుగెట్టినారురా..


ఎవ్వారొ ముద్దు బిడ్డలెందుకనొ పరుగెట్టినారు
ఎర్రనీ మడుగుల్ల మునిగి ముద్దలాయె ముద్దు బిడ్డల్

బోరు బోరుగ గండమోర్లు పెట్టి గుండె పగిలే తల్లులు

ఈ కడుపుకోతలు నార్పెదెవ్వరు రా
ఆ కలుపు మొక్కల కాల్చెదెవ్వడు రా

రాకాసి బల్లులంతా రాజ్యమేలే రాజులంటా -2
రావణాసురులంత జేరి రోజు కొక్కా రచ్చ పెడితే..

పంట చీడను మట్టు పెట్టే పురుగు మందుల విందులాయె--2

ఎంత నెత్తురు ఏరులైన వ్వాని దూప తీరదాయే

జాలి జూపర జంగమయ్యా జాగిలాలా జాతరాపర.. -2
కొండ దిగిరా కొమూరన్నా కొండ ముచ్చుల కోర్కె దీర్పర..

రెండు పూటల్ పస్తులుండీ నిండు ప్రాణాలెన్నొ మింగె -2
గోండ్రు కప్పలు గుంట నక్కలు కాకి కూత కోడెనాగులు ..

గద్దె కొరకే గాడ్దికొడుకుల్ గత్తారాలేపేరురా
ఇది మారీచులాటరా నువ్ మర్మమెరుగర పామర
--2
ఆడు తెస్తడొ, ఈడు తెస్తడు
అవ్వ ఇస్తదొ అయ్య తెస్తడొ
-2
ఎవ్వడిచ్చెదేంది రా ఇది ఎవ్వనీ జాగీరురా.. -2

నీకు నువ్వే రాజురా నిన్నేలెటోడింకెవడురా-2

గంగ గరుడాలెత్తుకెళ్ళేరా ..ఇంక ఆంబోతులాట సాగేరా
ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కన్ను సూడు

భూమి బుగ్గై పోయె సూడు బొంద గడ్డల జోరు సూడు..
గంగ గరుడా... గంగ గరుడాలెత్తుకెళ్ళేరా

6 comments:

Vasavya Yagati said...

హ్యాట్స్ ఆఫ్ ఉదయభాను'గారు'!

కిరణ్ said...

నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. మన ఉదయభాను గారు చలాకీగా, ఎంతో హూందాగా వ్యవహరించేది. నాకేమీ తప్పనిపించలేదు.. కానీ సమాజం లో మాత్రం అవాకులు చవాకులు వినిపిస్తుండేవి..ధైర్యంగా ముందుకెళ్తున్న భాను గారి లాంటివారు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తారు..

Venkat said...

మీరు ఈ పాట ని మీ బ్లాగ్ లో ప్రచురించినందుకు చాలా సంతోషం .

ఈ పాట లో ఒక వాక్యం లో చిన్న సవరణ ....

"బోరు బోరుగ గండమోర్లు పెట్టి గుండె పగిలే తల్లులు" అని ఉండాలి....

దయచేసి సవరించగలరు......

కిరణ్ said...

వెంకట్ గారు:
పాటను సవరించాను. పాట వింటూ వ్రాసేటపుడు నాకు ఆ వాక్యం అర్థం కాలేదండి. చదివి సవరణ పంపినందుకు ధన్యవాదాలు.
(ఇంటర్నెట్ లో ఎక్కడా ఈ పాట వ్రాతప్రతి దొరకలేదు..)

Anonymous said...

గంగ గరుడాలెత్తుకెళ్ళు అంటే ఏమిటో చెప్పగలరు.

Anonymous said...

Gaddalu ettuka poinavi neellani ani..vechi choosi right time lo gaddalu tannuku potay vaati food ni..